
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రివర్గంలో నారా లోకేష్ టీంగా పేర్కొనే ఒకరిద్దరి నాయకులు ఏడాది సర్వేలలో బాగా వెనకబడ్డారా ?అంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. తాజాగా చేసిన ఓ ప్రముఖ సంస్థ సర్వేలో పదిమంది మంత్రులు పనితీరులో వెనక పడ్డారు. వీరిలో సీనియర్ మంత్రులు ... జూనియర్ మంత్రులు కూడా ఉన్నారు. సీనియర్ల విషయన్ని పక్కన పెడితే తొలిసారి మంత్రులు ఆయన వారిలో ముగ్గురు మంత్రులు బాగా వెనకబడ్డారు అనేది ప్రజలు చెబుతున్న మాట. ఈ ముగ్గురు లోకేష్ టీం అని పార్టీలో చర్చ ఉంది. ఎన్నికలకు ముందు నుంచే వారు నారా లోకేష్ తో చనువుగా ఉండటం .. యువగళం పాదయాత్రకు మంచి సపోర్ట్ చేయడంతో వారిని లోకేష్ టీం గా చూస్తారు. ఇక పనితీరులో వెనక పడ్డారని ప్రచారం జరుగుతున్న వారిలో కర్నూలు ఎమ్మెల్యే , పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ - కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే , కార్మిక , ఎక్సైజ్ శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ - అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఎమ్మెల్యే , రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు.
రెండు మూడు సర్వేలలో కూడా ఈ ముగ్గురు మంత్రులు వెనకబడినట్టు ప్రచారం జరుగుతుంది. భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రభావం చూపలేకపోయారు. ఆయన దూకుడుగా లేరని చెబుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి పనితీరులో సొంత నియోజకవర్గంలోనే ప్రజలు పెదవి విరిస్తున్నారు. వాసంశెట్టి సుభాష్ పని తీరు కూడా పెద్ద గొప్పగా లేదంటున్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన విపక్షాలపై విమర్శలు చేయడంలోనూ దూకుడుగా ఉంటారన్న పేరు ఉంది. కానీ పనితీరులో మాత్రం వెనకబడ్డారు. మీరు ముగ్గురు వ్యక్తిగతంగా లోకేష్ టీంగా ప్రచారంలో ఉండడంతో లోకేష్ వీరిపై జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు