ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మదురై ప్రాంతంలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సుకి వెళ్లి అక్కడ పలు రకాల కీలక ప్రసంగాలను కూడా చేశారు. మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా సరే పారిపోవాల్సిందే అనే ఆశయాన్ని ప్రతిపాదిస్తూ ధర్మం మార్గంలోనే ముందుకు వెళ్లాలి అంటు పిలుపునివ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మధురైలో చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కౌంటర్ వేయడం జరిగింది.

2026 ఎన్నికలలో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్ కి ఉన్నదా అంటూ ప్రశ్నించారు చెన్నైలో ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే తాను పోటీ చేయవచ్చంటే పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి. మాటలు కాదు చేతలతో తమిళనాడులో ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని కౌంటర్ వేశారు. గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా కూడా వినడానికి తమ సిద్ధంగానే ఉన్నామంటే తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ కు తమిళనాడుకు అసలు ఏమి సంబంధం ఉందని మమ్మల్ని ప్రశ్నించడానికి అతని ఎవరు అంటూ కూడా ఫైర్ అవుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బిజెపి మాయలో మత రాజకీయాలను మాత్రమే ప్రోత్సహిస్తూ అల్లకల్లోలం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేరు అంటూ మంత్రి శేఖర్ బాబు ఫైర్ అయ్యారు. బిజెపి పార్టీతో మిత్రత్వం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ప్రాంతాలలో పర్యటిస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అన్ని విషయాలలో కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కు తమిళనాడు మంత్రి ఇలా కౌంటర్ ఇవ్వడంతో మరి మంత్రికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కౌంటర్ వేస్తారనే విషయంపై చూడాలి.. ఇక ఏపీలో కూడా ఏడాది  పాలన విజయవంతంగా పూర్తి అయ్యిందని ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: