
ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా అంబటి రాంబాబును నియమించారనే వార్తలు బయటకు రావటం తో .. అంబటి రాంబాబు ని చూసి నవ్వుకునే వాళ్ళ సంఖ్య వైసిపి లోనే ఎక్కువైపోయింది .. కారణమేమిటంటే గుంటూరు పశ్చిమ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీమంత్రి విడుదల రజిని తన వల్ల కాదని మళ్లీ చిలకలూరిపేటకు వెళ్ళిపోయింది .. అలాగే గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఆమె 50 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు .. అదే విధంగా గుంటూరు పశ్చిమ లో వైసీపీకి మంచి దీటైన నేత ఎవరు కనిపించడం లేదు ..
అప్పి రెడ్డి ఉన్న ఆయనలో జగన్ రెడ్డి ఇన్చార్జ్ ను అసెంబ్లీ అభ్యర్థిని చూడలేకపోతున్నారు .. ఇప్పటికే మేయర్ కావటి దండం పెట్టి వెళ్లిపోయారు .. ఇక పోనీ చివర్లో అంబటికే టికెట్ ఇస్తారంటే అలాంటిది కనిపించడం లేదు .. అంబటి నియోజకవర్గ ఇన్చార్జిగా ఖర్చు పెట్టుకుంటే చివరికి జగన్ ఎవరికి టికెట్ ఇస్తారో ఆయనకే తెలియదు . ఇక ఇక్కడ అంబటికి ఏమైనా బలం ఉందా అంటే అది కూడా కనిపించడం లేదు .. ఏ విధంగా చూసినా అంబటి రాంబాబుకు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు .. కానీ ఆయనకు ఓ ఇన్చార్జిగా పెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఓ సీటు కావాలి అందుకే గుంటూరు పశ్చిమ జగన్ ఆయనకు ఇచ్చినట్టు కనిపిస్తుంది .. రేపల్లెకు చెందిన అంబటికి సత్తెనపల్లి సేటు ఇవ్వటమే పెద్ద విచిత్రం .. అలాంటిది ఇప్పుడు అయను గుంటూరులో తెచ్చి పెట్టారు ..