రాయలసీమలోని రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి.. ముఖ్యంగా రాయలసీమలో ఏ ప్రాంతంలో రాజకీయాలు తీసుకున్న కూడా వాడి వేడిగానే కనిపిస్తూ ఉంటాయి. వైసిపి, టిడిపి నేతలు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది.  తాడిపత్రి నియోజకవర్గంలో అటు జేసి కుటుంబం, పెద్దారెడ్డి కుటుంబాల మధ్య నిరంతరం ఏదో ఒక విషయంలో వీరి మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జెసి ప్రభాకర్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన కూడా అవి పైన సంచలనంగానే మారుతూ ఉంటాయి.


అయితే నిన్నటి రోజున జేసీ .ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కూడా వైసిపి పార్టీలోకి రావచ్చేమో వైఎస్సార్ కుటుంబంతో మాకు ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి.. మీ అందరికన్నా మాకు ఎక్కువగా ఆ ఫ్యామిలీ క్లోజ్ అంటూ తెలిపారు. మేము ఇప్పుడోల్లం కాదు అంటూ.. ఎవరైనా ఏదైనా అంటే క్షమించండి నా బాధను బయటికి చెబుతున్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు జెసి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి.


జెసి కుటుంబం వైయస్ కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి మిత్రుడు అన్నట్టుగా ఎన్నోసార్లు తెలియజేశారు. జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు టిడిపి పార్టీ అధికారంలో ఉండి కూడా జెసి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో హాట్ టాపిక్ గా మారుతున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తువున్న ఇప్పటికే చాలా సందర్భాలలో చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు.. గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా జేసి ప్రభాకర్ రెడ్డి ఈసారి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో గెలవడం కూడా కష్టమే అన్నట్లుగా మాట్లాడారు. మరి రాబోయే రోజుల్లో ఎటువైపు నుంచి పోటీ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: