కొంతమంది చదువుకోకపోయినా చేస్తున్న పనులను చూసి వారికి వచ్చిన గౌరవాలను చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటాము. మరి కొంతమంది చదువు మీద ఇష్టంతో చేస్తున్న పనులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. అలా తాజాగా హైదరాబాదులోని 13 సంవత్సరాల వయసు వచ్చిన బడికి వెళ్ళని ఒక యువకుడు తల్లిదండ్రులు కూలి పనులకు వెళితే ఇంట్లో ఉన్న తన తమ్ముళ్లను , చెల్లిని ఆడిస్తూ ఉండేవారు. 9 ఏళ్ల వయసులో పనికి చేరి తన తండ్రి జీతానికి ఉండే ఇంట్లోనే పశువుల కాపరిగా 4 ఏళ్లు పనిచేశారు. చదువు అంటే ఇష్టం ఉన్నవారిని గుర్తించి ఒక స్వచ్ఛంద సంస్థ తనకి చదువు అంటే ఇష్టం అనే విషయాన్ని గుర్తించి బ్రిడ్జి కోర్సు గురించి వివరించి మరి చదువు బాట పట్టించేలా చేశారు.


దీంతో అప్పటి పశువుల కాపరి తాజాగా ఓయూ జియాలజీ విభాగంలో పీహెచ్డీ అందుకోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలానికి చెందిన కొండనాగుల గ్రామంలో చింతా పరమేష్ స్కూలుకు వెళ్లకపోయినా చదువు మీద ఆసక్తి ఉండడంతో.. దసరా పండుగకు కొత్త దుస్తులుగా స్కూలు యూనిఫామ్ కుట్టించుకోవడంతో యువకుడు జీవితమే మారిపోయింది.. అలా యూనిఫామ్ కుట్టించుకొని ఊరిలో జరిగిన జాతరకు వెళ్ళగా అక్కడ ఎంవి ఫౌండేషన్ కార్యకర్త మౌలాలి ఆ యువకుడిని గమనించారు.

ఆ యువకుడికి తమ ఊరికి సమీపంలోని ఫౌండేషన్ లో బ్రిడ్జి క్యాంపు ఉందని అందులో చదువుకోవచ్చుని చెప్పగా తల్లిదండ్రులను ఒప్పించి మరి పరమేశ్ అక్కడికి చేరారట. అలా 14 ఏళ్ల వయసులో ఏడవ తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. ఆ తర్వాత బల్మూరు మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటూ పదవ తరగతి ఉత్తీర్ణులయ్యాడు. మళ్లీ కల్వకుర్తిలో ఉండే గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ పాస్ అయ్యి హైదరాబాదులో సైఫాబాద్లోని సహించ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఓయూ ప్రాంగణంలో ఎంఎస్సీ జియాలజీ పూర్తి చేశారు. పీజీలో 85% మార్కులతో పాసయ్యారట.


పీజీలో ఉత్తమ మార్కులు సాధించడంతో పరమేశ్ ఓయూలో పీహెచ్డీసీటీని అందుకున్నారు. ఆ తర్వాత పీహెచ్డీ చేసి ఆచార్య మురళీధర్ పర్యవేక్షణలో భూగర్భ జలాల పరిస్థితుల పైన అధ్యయనం చేసి పరిశోధన పత్రాలను సమర్పించారు అలా 35 సంవత్సరాల వయసులోనే పీహెచ్డీ పట్టా అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: