ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం హస్తిన పర్యటన పెట్టుకోబోతున్నారు .. అయితే ఈసారి ఆయన ఈ టూర్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది .. ఎందుకంటే ఈసారి ఆయన ఏకంగా మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు .. ఇక చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ విషయంలోకి వెళితే .. ఈనెల 14న ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు .. అలా మొదలైన ఆయన టూర్ ఈనెల 16 వరకు ఢిల్లీలోనే కొనసాగుతుంది .. ఇక ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీ తో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారని తెలుస్తుంది. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వివరాల్లోకి వెళితే .. చాలా మ్యాటర్ ఉందని తెలుస్తుంది .. ఒకవైపు ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి .. ఈసారి సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోతున్నారని కూడా వార్త‌లు వస్తున్నాయి ..


జమిలి అంటే ఎంతో సీరియస్ మేటరే .. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2029 వరకు ఎన్నికలు అనుకొని షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకుని అమరావతి పోలవరం వాంటి వాటితో ఇతర కార్యక్రమాలతో ఒక యాక్షన్ ప్లాన్ రెడీగా పెట్టుకున్నారు .. అయితే ఒక్క‌ ఏడాది ముందుగానే ఎన్నికలు తీసుకుని ముందుకు వస్తే చేయాల్సింది చాలా ఉంటుంది .. అన్ని యుద్ధం ప్రాతిపదికన మొదలుపెట్టాలి దాంతో నిధులు చాలా అవసరం .. ఈ విధంగా ఏపీకి నిధులు అవసరం ఎంతగానో ఉంది .. అదే విధంగా రాజకీయంగా ఎన్నో అంశాలు ఉన్నాయి .. దాంతో చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి కీలక అంశాలను చర్చించబోతున్నారని అంటున్నారు .. గత నెల జూన్ 21న విశాఖ వచ్చిన మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్నారు .. ఆ తర్వాత బాబు ఢిల్లీ వెళ్లి మోడీని కలవటం ఇదే మొదటిసారి .. ఇక దీంతో ఇద్దరు అనేక అంశాలు చర్చించబోతున్నారని కూడా అంటున్నారు .. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తుంది ..


ఇక దాంతో ఆయనతో కూడా ఎన్నో ముఖ్యమైన విషయాలే మాట్లాడతారని అంటున్నారు.. అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీత‌రామ‌న్  తోను చంద్రబాబు భేటీ అవుతారు .. అలాగే కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయి పోలవరం , బనగచర్ల ప్రాజెక్టు మీద చర్చిస్తారని కూడా అంటున్నారు .. ఇలా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎన్నో అంశాలను ఆయన కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించి ఏపీకి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారని అంటున్నారు . ఇలా చంద్రబాబు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నారంటే ఇది రాజకీయంగా కూడా ఈసారి ఈ టూర్‌ ఎంతో ప్రాధాన్యత తీసుకువస్తుందని అంటున్నారు .. ఇలా మొత్తానికి చంద్రబాబు తన  మార్క్‌వ్యూహాలు అమల్లోకి వచ్చాక కానీ ఎవరికీ తెలియవు .. సో చంద్రబాబు ఢిల్లీ టూర్ మేటర్ అయితే చాలా ఉందనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: