ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మైనింగ్ మాఫియా జోరు గా కొనసాగుతోంది. ఈ మైనింగ్ పై ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంజా విసిరారు. మైనింగ్ పై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యం లో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. వివరాల్లోకి వెళ్తే.. విజయ నగరం జిల్లా గడివిడి మండలం  దేవాడ మైనింగ్ బ్లాక్ లో  ప్రభుత్వ అనుమతుల కంటే ఎక్కువగా నిబంధనలకు విరుద్ధం గా  మ్యాంగనీస్ తవ్వకాలు సాగిస్తున్నారు.  దీనిపై  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొంత మంది ఫిర్యాదు చేశారు. ఈ మాంగనీస్ తవ్వకాల పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ తన కార్యాలయ సిబ్బందిని పిలిచి మాంగనీస్ తవ్వకాల పై విచారణ జరపాలని ఆదేశించారు.
 
 ఏడాది కి పది లక్షల  టన్నుల తవ్వకాలు జరపాలని నిబంధన ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా నిబంధన లకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ ఖనిజ సంపదను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా  ఈ మైనింగ్ బ్లాక్ కు సంబంధించి ఈ వేలం లో కూడా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వం లోనే వేలం వేశారని, ప్రజా అభిప్రాయ సేకరణ ను పరిగణ లోకి తీసుకోలేదని తెలియజేశారు. ఈ విషయం పై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 

 దీనిపై సమగ్ర నివేదిక అందించాలని వారిని కోరారు. ఈ వేలం పై వచ్చినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ గురించి పూర్తిగా వివరాలు బయట పెట్టాలని ఆ విషయాలు నాకు తెలియజేయాలని పవన్ వారికి సూచించారు. మరి చూడాలి దీనిపై ఏ ఏ విషయాలు నివేదికలో బయటకు వస్తాయో  ముందు ముందు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మైనింగ్ బ్లాక్ పేరుతో చాలామంది  అక్రమ దందా చేస్తూ  ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: