రాజకీయాల్లో తండ్రుల వారసత్వం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తండ్రుల కీర్తి, పేరు, కష్టాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన త‌న‌యులు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో ఎంతమంది నిజంగా తండ్రుల స్థాయికి ఎదిగి, వారసత్వాన్ని నిలబెట్టారన్న ప్రశ్న ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. తండ్రుల పేరుతో రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కానీ తండ్రికి త‌గిన వార‌సుడు అనిపించుకోవ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నేత‌ల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ కోణంలో రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే, తండ్రుల స్థాయిని అందుకుంటున్న వారసులు చాలా తక్కువగానే ఉన్నారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ సొంత పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ  తండ్రి స్థాయికి చేరుకోలేకపోయారు.


ఇక, ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్న కొన్ని త‌న‌యులు తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దూకుడు మంచిదే అయినప్పటికీ, వారు వివాదాలకు కేంద్రంగా మారడం పెద్ద మైనస్‌గా మారుతోంది. తండ్రి చేసిన మంచి పనులను కొనసాగించడంలో వెనుకబడి, సొంత అజెండాలతో ముందుకు సాగడం వల్ల ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇది వారికి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.


గతంలో తండ్రులు ప్రజలను మాత్రమే కాకుండా ప్రత్యర్థులను కూడా అక్కున చేర్చుకుని రాజకీయాలు చేశారు. సమన్వయం, సహనం, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. కానీ ప్రస్తుత వారసులు అందుకు భిన్న‌మైన రాజ‌కీయాలు చేస్తున్నారు. తండ్రుల విలువలు, ఆలోచనలను వారసులు అందిపుచ్చుకుంటేనే ఈ వార‌సుల రాజకీయ భవిష్యత్తు సురక్షితం అవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: