
అయితే వైసిపి వర్గాల వారికి మాత్రమే ఈ విషయాలు వెళుతున్నాయని.. కానీ రాజకీయ పార్టీలు అంటేనే కొన్ని గ్రూపులు ఉంటాయి. ఈ పార్టీలకు సంబంధం లేకుండా మరికొన్ని వర్గాలు కూడా ఉంటాయి.. వాళ్లే రాజకీయాలలో కీలకమైన ఓటు బ్యాంక్ . సుమారుగా అలా ఏపీలో 20 నుంచి 25% వరకు ఓటింగ్ కలదు. ఆ వర్గాల వరకు వెళ్లాలి అంటే వీళ్ళల్లో వీరు షేర్లు చేసుకుంటే అది కుదరదు.. ఒక చట్టబద్ధమైన వేదిక మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వ్యవహారాలను, చేస్తున్న తప్పులను లేవనెత్తాలి. అలాంటి లేవనెత్తాలి అంటే సరైన వేదిక ఏదైనా ఉందంటే అది అసెంబ్లీలో మాత్రమే.
అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి విషయం కూడా లెక్కలో ఉంటుంది. రికార్డు పూర్వకంగా ఉంటుంది.. అసెంబ్లీలోకి వస్తే ఖచ్చితంగా అవమానిస్తారని మాట్లాడేందుకు మైక్ ఇవ్వరని వైసీపీ నేతలు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తెలిపారు.. ఇవన్నీ జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లి ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి వాటి మీద ప్రశ్నించారంటే చాలు..మాట్లాడే అంశం సరైన అంశమైతే చాలు ప్రజలు కూడా మద్దతు తెలుపుతారు. అందుకే వైసిపి మంత్రులు జగన్ తో మాట్లాడి.. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో జగన్ ను అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
2024 సాధారణ ఎన్నికలలో జగన్ ఓటమి తర్వాత అసెంబ్లీలోకి రావడానికి ఇష్టం లేదనే వాదనలు ఎక్కువగా వినిపించాయి.. 2014లో జరిగిన ఎన్నికలలో ఓటమి తర్వాత 67 సీట్లు సాధించి ప్రతిపక్షంలో ఉన్నారు. 67 సీట్లతోనే ప్రతిపక్షంలో పోరాటం చేశారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజలలోనే ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. అలా 2019లో 151 సీట్లతో ఎనలేని విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా
ఏక చక్రాధిపత్యం వహించారు. వైసిపి పార్టీ ఆవిర్భావం చేసినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇంత తక్కువ సీట్లతో అసెంబ్లీలోకి వస్తే జగన్ ఎలా పోరాటం చేస్తారు.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. 11 సీట్లతో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించడం చేస్తేనే.. హైలెట్ అవుతారు. ఆ పోరాటాలన్నీ కూడా అసెంబ్లీలో హైలెట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ పేరు ప్రజలలో వినిపించాలి అంటే అసెంబ్లీలోకి వెళ్లాల్సిందే..