ఇటీవల నకిలీ మద్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా హడలెత్తించింది. ఆ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్ధన్‌రావు, పోలీసుల విచారణకు ముందు ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, తన ప్రోత్సాహంతోనే మద్యం వ్యాపారం సాగిందని ఆరోపించాడు. ఈ వీడియో బయటకు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ నేతలు జోగిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. జోగి రమేష్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. “ నాకు అద్దేపల్లి వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కారణాల వల్లే ఈ ఆరోపణలు వస్తున్నాయి ” అని తెలిపారు. అయినా విమర్శలు ఆగకపోవడంతో, ప్రజా సమక్షంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని ప్రకటించారు. చాలా మంది దీన్ని రాజకీయంగా పరిగణించినా, జోగి నిజంగానే తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి ప్రమాణం చేశారు.
అయితే, ఈ చర్య వైసీపీ నాయకత్వానికి నచ్చలేదని టాక్. పార్టీ నైతిక విలువలు, నిర్ణయాలు పక్కనబెట్టి వ్యక్తిగత స్థాయిలో ఈ విధమైన చర్యలు తీసుకోవడం సరైనది కాదని జగన్ అభిప్రాయపడ్డారట. ప్రస్తుతం పార్టీ ఒక సున్నితమైన దశలో ఉందని, ఇలాంటి విషయాలు వైసీపీకి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. జోగి రమేష్ వివరణ తర్వాతే పార్టీ తర్వాత పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ ఘటనతో వైసీపీ లో మరోసారి అంతర్గత విభేదాలు, అసంతృప్తులు బహిర్గతం కావడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి