యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి దండ్రులు ఆమె పాలిట రాక్షకుల్లా మారారు. కొన్ని సంవత్సరాల పాటు ఆమెను ఇంట్లో బంధించి కర్కశంగా ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. ఇంతటి ఘోరాన్ని చూస్తున్న ఏ సమాజం అయినా ఊరుకుంటుందా...? ఆమెను వారి తల్లిదండ్రుల చేర నుంచి విడిపించారు. ఆమెను బంధించిన గది నుండి ఆమెను బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఆమెను మీడియా చుట్టుముట్టింది, వారిపై వారి తల్లుదండ్రులు ప్రవర్తించిన తీరును  సభ్య సమాజం అసహ్యించుకుంది. ఆమె పేరే ప్రత్యూష.

 

ఆమెకు జరిగిన అన్యాయాన్ని మేదిఆ ద్వారా తెలుసుకున్న అకెకేఆర్ ఆమెను చేరదీసి తనకు కావాల్సిన ఏర్పాట్లను ఆయనే దగ్గరుండి చూసుకొంటానని, ఆమెను ఉన్నత విద్యావంతురాలిగా తీర్చి దిద్దుతానని మాటిచ్చారు. ఆమెకు నచ్చిన అబ్బాయితో కూడా వివాహం జరిపిస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే,  ఐ సంఘటన జరిగిన తర్వాత ప్రత్యూష తన చదువును కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ కి ఆమె మరో కోరిక కోరనుంది. అదేంటంటే, ప్రస్తుతం ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం సంరక్షణలో ఉన్న ప్రత్యూష ఇప్పుడు తనను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటోంది.


ఈ విషయాన్ని మహిళా సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా తెలిపింది. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలుమార్లు కౌన్సెలింగ్ చేసే యత్నం చేస్తున్నా.. ప్రస్తుతం తాను ఇరవై ఏళ్ల మేజర్‌నని, తన ఇష్టప్రకారం చేయాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది.


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీకి చెందిన మద్దిలేటిరెడ్డి(27) బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా‌పని చేస్తున్నాడు. గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న తన మిత్రుడి పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించేందుకు వెళ్లి.. ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఇలా వరుసగా రెండ్రోజులు వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లాడు. ప్రభుత్వ సంరక్షణలో చేరిన తర్వాత మద్దిలేటికి ప్రత్యూష ఫోన్ చేయటం, అతను కూడా ఆమెకు ఫోన్లు చేయటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ, పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది.


తాను హాస్టల్‌లో ఉండలేనని, మద్దిలేటిరెడ్డిని పెళ్లి చేసుకున్నాకే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని ప్రత్యూష చెబుతోంది. హాస్టల్‌లో అన్నంలో సోడా వేస్తున్నారని, ఉడకని బియ్యంతో కూడిన అన్నం తినలేక పోతున్నానని తెలిపింది. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతోంది. కాగా, ప్రత్యూషను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత.. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించలేదని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావు తెలిపారు. ఈ విషయంలో ఆమెకు మానసిక వైద్యులతో శిక్షణ ఇప్పించాలని అచ్యుతరావు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: