చెన్నై సదావర్తి భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ భూముల వ్యవహారంలో దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని సాక్షి పత్రిక బయటపెట్టింది. ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రచురించి సర్కారును హడలెత్తించింది. ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై సీఎం నేరుగా స్పందించలేకపోయారంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సదావర్తి భూములు బురద కడుక్కునేందుకు టీడీపీ సర్కారు నానా తంటాలు పడుతోంది. దాదాపు 80 ఎకరాల భూములను కేవలం 22 కోట్లకే టీడీపీ పెద్దలకు పంచిపెట్టిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండే సరికి నష్టనివారణకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు కూడా అడ్డగోలు దారిలోనే వెళ్తోంది. టీడీపీ నేత రామానుజయశెట్టి బంధువులు ఇచ్చిన రేటు కంటే ఎక్కువ ఎవరైనా ఇస్తే భూము ఇచ్చేస్తామని తొలుత ప్రకటించింది. 


రామానుజయశెట్టి కూడా ఇదే సవాల్ పలుసార్లు విసిరారు.. కానీ ఇప్పుడు ఓ కంపెనీ సరే నేను కొంటాను అని ముందుకొచ్చేసరికి ప్రభుత్వ పెద్దల గొంతులో పచ్చివెలక్కాయపడింది. అందుకే ఆ కొనుగోలుదారుని బెదరగొట్టేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అడ్డగోలు నిబంధనలు తయారు చేస్తున్నారు.  కొనేందుకు ముందుకొచ్చిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు రాసిన ఓ లేఖలో అనేక చిత్ర విచిత్రమైన నిబంధనలు తెలిపారు. 

సదావర్తి భూములను కొంటే మీరు కష్టాల్లో ఇరుక్కుంటారు.. మీరు కొన్నాక మాకు ఎలాంటి సంబంధమూ ఉండదు. మేం రిజిస్ట్రేషన్ చేయం. సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తాం. రిజిస్ట్రేషన్ విషయమై తమిళనాడు ప్రభుత్వంతో మీరే మాట్లాడుకోవాలి. మీరు మీ సొంత ప్రయత్నాలు చేసుకోవాలి. మీ సొంత ఖర్చులతో ఆక్రమణలను మీరే తొలగించుకోవాలి.. అంటూ నిబంధనలు వినిపించి సదరు సంస్థను బెదరగొడుతోంది. టీడీపీ నేతలకు తప్ప వేరే ఎవరికీ ఆ భూమి దక్కకూడదనే సర్కారు పెద్దలు ఇలాంటి తొండాట ఆడుతున్నారని ఎవరైనా అనుకుంటే అందులో తప్పేమీ లేదు కదా..



మరింత సమాచారం తెలుసుకోండి: