రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్నది ప్రతీ సారీ రుజువు అవుతూనే ఉంది. ఇపుడు అదే మరో మారు ప్రూవ్ అవుతోంది. కాంగ్రెస్ వ్యతిరేకత మూల సూత్రంగా  ఏర్పాటైన టీడీపీ ఇపుడు చెతిలో చేయి వేస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం సైకిల్ తో సవారీకి సై అంటున్నారు. మొత్తానికి ఈ పొత్తు రాజకీయ ఎత్తులలోకెల్లా పై ఎత్తు అనిపించేస్తోంది.

ఒప్పందం కుదిరింది :



తెలంగాణాలో టీడీపీకి క్యాడర్ ఉంది కానీ లీడర్లు లేరు. కాంగ్రెస్ కి అన్నీ ఉన్నా అయిదవతనం లేదు. అందుకే ఈ రెండు పార్టీలూ చేతులు కలిపాయి. మొత్తం 119 ఎమ్మెల్యే సీట్లకు గానూ 15 సీట్లను టీడీపీ కోరింతే 12 కి డేల్ సెట్ అయిందట. అలాగే, 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒకే అనేసిందట.


బాబుతో ఫైనల్ టచప్ :


ఇక పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. సీట్లపైనా దాదాపుగా ఒప్పందం కుదిరిపోయింది. మిగిలింది చంద్రబాబు తో కూర్ఛుని  ఒకే అనిపించడమే. రేపు (శనివారం) హైదరాబాద్ రానున్న బాబుతో తెలంగాణా పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి కూర్చుని ఫైనల్ టచప్  ఇస్తారట. మొత్తానికి కేసీయార్ ని ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ రెడీ అయిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: