పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. తెలంగాణలోని ఓ ఎంపీ సీటుకు మాత్రం నాయకుల నుంచి చాలా డిమాండ్ వినిపిస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతలు అక్కడ పోటీ చేస్తామని ఊవ్విళ్లూరుతున్నారు.

Image result for khammam mp seat


ఇంతకీ ఆ సీటు ఏంటంటంటారా.. అదే ఖమ్మం ఎంపీ సీటు.. ఇక్కడ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు చాలామంది హైకమాండ్ దగ్గర లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఇక్కడ పోటీచేయమని రాహుల్ గాంధీని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆయన ఎలాగూ ఓకే చెప్పడని వారి నమ్మకం కావచ్చు.

Related image


ఇప్పుడు ఈ సీటు తనకు కేటాయించమని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సీటుకు ఎందుకు అంత డిమాండ్ అంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చూపించింది ఇక్కడే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ కేవలం ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది .

Image result for khammam mp seat


అందుకే ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీ చేస్తే గెలుపు ఖాయం అన్న భరోసా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణలో ఇంకా ఏ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా గెలుస్తామని చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ పోటీకి అంతా పోటీపడుతున్నారు. కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ను ఖమ్మంలో పోటీచేయమని అడగడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: