మెల్‌బోర్న్‌లో నిన్నజరిగిన టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ రెండోసారి భారత ఘన విజయం సాధించింది. అంతకు ముందు ఆస్ట్రేలియాతో 5 వన్డే మ్యాచ్ ల్లో భారత్ నాలుగు ఆటలు చిత్తుగా ఓడినా ఐదో వన్డే మాత్రం గెలిచి పరవుదక్కించుకుంది. ఇదే ఊపులో టి-20 మ్యాచ్ లో రెండు సార్ల భారత ఆటగాళ్లు విజృంభించారు. తాజాగా టి-20 మ్యాచ్ లో  ఆసిస్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడ్డాడు. ఫించ్ తోడ కండరాలు పట్టేడయంతో మూడో టీ-20 మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని తేలింది.


ఫించ్‌ స్థానంలో లెప్ట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా జట్టులోకి వచ్చాడు. త్వరలో న్యూజిల్యాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లోనూ అతను ఆసిస్ జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణమని మూడో మ్యాచులో గెలిచేందుకు తీవ్రంగా కృషిచేస్తామని కెప్టెన్ షేన్ వాట్సన్ చెప్పాడు.


టీమిండియా

Preview: 2nd T20I: Australia Vs India in Melbourne on January 29

మరో వైపు మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ20లో గెలిచిన ధోని సేన మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. వన్డే సిరిస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా సరే టీ20 సిరిస్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: