మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. గతేడాది జూన్‌లో రోహిత్ శర్మ తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ లో పాల్గొన్న యువరాజ్ సింగ్  తోటి క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో పెను దుమరాన్ని రేపింది. ముఖ్యంగా కులానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చెయ్యడంతో నిమ్న కులాల వారు యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఈ వివాదం పెద్దది కావడంతో యువరాజ్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నాడు.

తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, చహల్ తో ఉండే సన్నిహిత్యం వల్లే సరదా వ్యాఖ్యలు చేశానాని పేర్కొన్నాడు. తన చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లోనే వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఆ వివాదం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది.  సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ..యువరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హరియాణాకు చెందిన ఓ లాయర్‌ హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో ఆదివారం పిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై లాక్‌డౌన్‌ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు.. ప్రస్తుతం యువరాజ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.ఓ అధికారి వెల్లడించారు ఐ‌పి‌సి సెక్షన్లు 153, 153 ఏ , 295 , 505 , తో పాటు ఎస్సీ , ఎస్టీ , చట్టం లోని 3 (1)  ( ఆర్ ) , 3( 1 ) ఎస్ కింద ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేశారు.త్వరలోనే యువరాజ్ సింగ్ కు కోర్ట్ నుండి నోటీసులు అందనున్నాయి. అయితే ఎప్పుడో సోషల్ మీడియా లో చేసిన వ్యాఖ్యలుపై ఇప్పుడు అభ్యంతరం లేవనెత్తడం పై , యువరాజ్ సింగ్ అభిమానులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసు పై యువరాజ్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: