ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021లో ఈరోజు న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు తక్కువ పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసాడు. ఇక మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ వన్ డౌన్ లో వచ్చి 14 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 17 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగా... వికెట్ కీపర్ రిషబ్ పంత్ 19 బంతుల్లో 12 పరుగులు చేశాడు. అలాగే హార్థిక్ పాండ్య కొంచెం వికెట్లను ప్రయత్నం చేసిన చివర్లో 24 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్ ఒక్క చేయకుండానే వెనుదిరిగాడు.

అయితే చివరి వరకు నాటౌట్ గా ఉన్న రవీంద్ర జడేజా 19 బంతుల్లో 26 పరుగులు చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేయగలిగింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా.. ఇష్‌ సోధీ రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే ఒక్కో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 111 పరుగులు చేయాలి. అయితే లక్ష్యం చిన్నది కావడంతో మన భారత బౌలర్లు దానిని కాపాడగలరు అనేదే ప్రశ్న. అయితే ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టుకు సెమీస్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అనేది తెలిసిందే. ఓడిన జట్టు దాదాపు టాప్ 2 పైన ఆశలు వదులుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: