సాధారణంగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే ఇక ప్రత్యర్థులుగా ఎంతో అగ్రెసివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టును గెలిపించేందుకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను శత్రువులుగా చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ముగుస్తుందో అప్పుడు మాత్రం మళ్లీ స్నేహితులుగా కలిసి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకరికి ఒకరు సలహాలు సూచనలు పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం చేస్తూ ఉంటారు.


 వేరు వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఒక క్రికెటర్ గా  మాత్రం తామందరం ఒకే జాతికి చెందిన వారం అంటూ నిరూపిస్తూ ఉంటారూ క్రికెటర్లు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి ఇది నిరూపించారు. ఒకప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన వారే కావడం గమనార్హం. ఇక సన్రైజర్స్ ఆడిన వీరి మధ్య మంచి స్నేహ బంధం చిగురించింది. కానీ ఈ ఏడాది మెగా వేలం కారణంగా డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టులోకి రషీద్ ఖాన్ గుజరాత్ జట్టులోకి వెళ్లిపోయారు. అటు కేన్ విలియమ్సన్ మాత్రం హైదరాబాద్ నీ అంటిపెట్టుకుని ఉన్నాడు.


 ఢిల్లీ కాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ. కాగా మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. తనను ఘోరంగా అవమానించి బయటకు పంపించి సన్రైజర్స్ ఫ్రాంచైజీ కి  చెందిన ఆటగాళ్లతో వార్నర్ వ్యవహరించిన తీరుకు అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు. కేన్ విలియమ్సన్ తో సెల్ఫీ దిగిన వార్నర్ నిన్ను చాలా మిస్ అయ్యాను బ్రో అంటూ ఒక ఫోటో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన రషీద్ ఖాన్ నేను కూడా అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: