టీమిండియా డేర్ అండ్ డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు  క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా తరఫున అతను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్,   ఎన్నోసార్లు ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందించిన సందర్భాలు ఇప్పటికీ కూడా క్రికెట్ ప్రేక్షకులు మర్చిపోలేదు అని చెప్పాలి.  అంతలా  తన ఆటతీరుతో  ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా  వేదిక అభిమానులకు దగ్గరగానే ఉంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.


 ఇలా ఎన్నో ఏళ్ల క్రితం బ్యాట్ తో  క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరించిన  వీరేంద్ర సెహ్వాగ్   మరోసారి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగేందుకు సిద్దమయ్యాడు అని తెలుస్తుంది. 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న లెజెండ్ లీగ్ క్రికెట్ తదుపరి ఎడిషన్ కోసం టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ పట్టుకొనున్నాడు. చాల కాలంగా ఒక్క క్రికెట్ కు  కూడా దూరంగా  ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ను లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో కొత్తగా వచ్చిన గుజరాత్ జెయింట్స్  జట్టు కెప్టెన్గా ఎంచుకుంది.  ఈ క్రమంలోనే ఇక వీరేంద్ర సెహ్వాగ్ ఆటను మరోసారి ఆస్వాదించేందుకు అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి.


 అయితే మరోసారి క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగడం పై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తాను అన్న అనుభూతి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. టోర్నీలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపాడు. అంతేకాకుండా జట్టు ఎంపిక కోసం కూడా ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ టోర్నీలో పాల్గొనబోయే మరో కొత్త జట్టు ఇండియా క్యాపిటల్స్ జట్టుకి వీరేంద్ర సెహ్వాగ్  సహచరుడు టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. కాగా  2018 లోని క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు ప్రకటించిన గంబీర్  ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో మెంటార్ గా  కొనసాగుతున్నాడు. ఇక రాజకీయాల్లో ఢిల్లీ ఎంపీ గా కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: