గత కొంతకాలం నుంచి భారత కీలక బౌలర్ బుమ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు బుమ్రా భారత జట్టులోకి వస్తే ఇక టీమిండియా బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా మారుతుంది అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న బుమ్రా చివరికి టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బాగా రాణించాడు అని చెప్పాలి. కానీ బుమ్రా వచ్చాడు అన్న ఆనందం ప్రేక్షకులకు ఎక్కువ రోజులు మిగలలేదు. మళ్లీ సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ కి ముందు బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.


 అంతేకాడు ఇక అతని వెన్నుముకకు ఫ్రాక్చర్ అయ్యిందని సర్జరీ చేయించుకునేందుకు అతను సిద్ధమయ్యాడని.. తద్వారా నాలుగు నుంచి ఐదు నెలలపాటు బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక బుమ్రా టీమిండియా కు దూరం కావడం టి20 వరల్డ్ కప్ కి ముందు భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అంటూ ప్రచారం మొదలైంది. ఇలాంటి సమయంలో ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే నిజంగా జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా టి20 వరల్డ్ కప్ కు టీమిండియా కు అందుబాటులో లేకపోతే మాత్రం.. అది భారత జట్టుకు ఎవరూ భర్తీ చేయలేని లోటు అంటూ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షైన్ వాట్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదే జరిగితే ఇక టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కప్ గెలిచే అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి అంటూ తెలిపాడు. ప్రపంచ క్రికెట్లో బుమ్రా లాంటి బౌలర్ మరొకరు లేరని అతనికి అసమాన్యమైన ప్రతిభ నైపుణ్యాలు ఉన్నాయి అంటూ కొనియాడాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు అంటూ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: