టి20 వరల్డ్ కప్ కి ముందు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే.  జట్టుbలో కీలక ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతున్న షాహీన్ ఆఫ్రిది గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అయితే అతను వరల్డ్ కప్ వరకు కోలుకుంటాడా లేదా అన్న విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. తన అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థుల వికెట్లు పడగొడుతూ ఎప్పుడూ పాకిస్తాన్ విషయం లో కీలక పాత్ర వహించే షాహిన్ ఆఫ్రిది లేని లోటు గత కొంత కాలం నుంచి జట్టులో స్పష్టం గా కనిపిస్తుంది అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే షాహిన్ ఆఫ్రిది ప్రపంచ కప్ లో భాగం కాబోతున్నాడని మరోసారి తన బౌలింగ్ తో పాకిస్తాన్కు అద్భుతమైన విజయాలు అందించబోతున్నాడని ఎంతో మంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.. అయితే గాయం నుంచి కోలుకున్న షాహిన్ ఆఫ్రిది  మునుపటి ఫామ్ ప్రకారమే రాణిస్తాడా లేదా అన్నది కూడా ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న. ఇలాంటి సమయం లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 అందరూ అతను టి20 వరల్డ్ కప్ లో బాగా రాణించాలని ఆశిస్తూ ఉంటే.. సల్మాన్ బట్ మాత్రం భిన్నం గా స్పందించాడు. షాహిన్ అఫ్రిది  100% ఫిట్ గా ఉంటేనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 ప్రపంచ కప్ లో ఆడించాలి అంటూ సూచించాడు సల్మాన్ బట్. ఎందుకంటే స్వార్థపూరితం గా ఆలోచించి పూర్తిగా కోలుకోక పోయినప్పటికీ అతన్ని ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టులో భాగం చేస్తే మరోసారి అతను గాయపడ్డాడు అంటే కెరియర్ ఎక్కువ కాలం కొనసాగడం కష్టతరం అవుతుందని అతని భవిష్యత్తు పాడవుతుందంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: