ప్రస్తుతం ఇండియా దేశవాళీ టోర్నీలలో ఒకటిగా ఉన్న విజయ్ హజారే ట్రోపీ సీజన్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు లీగ్ మ్యాచ్ లు జరుగగా , ఇప్పుడు ఖ్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి, ఈ దశకు చేరుకున్న జట్లలో పంజాబ్ , కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ , జమ్మూకాశ్మీర్ , అస్సాం , సౌరాష్ట్ర మరియు తమిళనాడు జట్లు ఉన్నాయి. ఇక ముంబై , కేరళ , ఢిల్లీ లాంటి జట్లకు సైతం చిన్న జట్లు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎనిమిది జట్ల మధ్యన ఖ్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. పంజాబ్ - కర్ణాటక, మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్ , జమ్మూకాశ్మీర్ - అస్సాం మరియు సౌరాష్ట్ర - తమిళనాడు లు సెమిఫైనల్ కు వెళ్ళడానికి పోటీ పడుతున్నాయి.

అందులో భాగంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో రికార్డులు నమోదు కావడం విశేషం. టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్ బౌలింగ్ ఎంచుకుంది, అయితే ఈ నిర్ణయం ఎంత పొరపాటు అనేది తెలియడానికి చాలా సేపు పట్టలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజృంభణ ముందు యూపీ బౌలర్లు నిలువలేకపోయారు. మ్యాచ్ లో అన్ని ఓవర్ లను ఆడిన రుతురాజ్ అందరి బౌలర్లను చీల్చి చెండాడాడు. రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు మరియు 16 సిక్సర్లు సంధించి 220 పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్ లో తొలి డబల్ సెంచరీ నమోదు చేశాడు. ఇక మరో విశేషం ఏమిటంటే... రుతురాజ్ శివ సింగ్ వేసిన 49 వ ఓవర్ లో ఏకంగా 7 సిక్సర్లు కొట్టి రికార్డ్ సృష్టించాడు.

ఇతని అద్భుత ఇన్నింగ్స్ తో మహారాష్ట్ర 330 పరుగులు చేసి భారీ టార్గెట్ ను ఉత్తరప్రదేశ్ ముందు ఉంచింది. ఇప్పడు రుతురాజ్ ఇన్నింగ్స్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఇంతకు ముందు ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టిన గారి సోబెర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, వైట్ లీ , జాజై, లియో కార్టర్, కిరణ్ పోలార్డ్ మరియు పెరీరా ల సరసన గైక్వాడ్ నిలిచాడు. అయితే ఓవర్ కు ఏడు సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: