
ఇక ఇలాగే ప్రస్తుతం భారత క్రికెట్లో ఏకంగా క్రికెట్ ఆటకి దేవుడిగా గుర్తింపు సంపాదించుకుని.. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్గా ప్రస్తుతం లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్న మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇక ప్రపంచ క్రికెట్ అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడు సచిన్. ఇక అలాంటి సచిన్ వారసుడు క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అంచనాలు.. ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా సచిన్ వారసుడిగా క్రికెట్ లోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ మాత్రం ఎందుకో అంచునాలను అందుకోలేకపోయాడు.
అందరూ యువకులు 20 ఏళ్లు కూడా నిండకముందే అదిరిపోయే ప్రదర్శన చేసి టీమిండియాలోకి వస్తూ ఉంటే.. దిగ్గజ సచిన్ కుమారుడు మాత్రం ఇప్పటివరకు రంజీలలో కూడా అవకాశం దక్కించుకోలేదు. దీంతో సచిన్ అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు. ఇకపోతే ఇటీవల ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ సాధించాడు. రంజీలలో ఆడెందుకు అవకాశం దక్కించుకున్నాడు. గోవా తరపున తన కెరియర్ లో తొలి రంజీ మ్యాచ్ లో బలిలోకి దిగాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన అర్జున్ నూ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పటికీ ఐపీల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ముంబైలో అవకాశాలు రాకపోవడంతో ఇక గోవాకు మారాడు అర్జున్. అటు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్ఓసి కూడా జారీ చేయడం గమనార్హం.