కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదంటారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం.

 

దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పారు.

 

ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: