రియో ఒలంపిక్స్ లో గెలుపొందిన వారికి కార్లు ఇవ్వడం ఆనవాయితి. అయితే ఎప్పటిలానే రష్యా పతకాలు గెలుచుకున్న అథ్లెట్స్ అందరికి బి.ఎం.డబల్యు కార్లు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇలా ఇచ్చిన కార్ల మీద రియో ఒలంపిక్స్ సింబల్ ఉంచారు. అయితే ఇలా ఇచ్చారో లేదో అలా దాన్ని ఆన్ లైన్ సేల్ లో పెట్టేశాడట ఓ రష్యా క్రీడాకారుడు.


ఎంతో ఖరీదైన ఆ కార్ కు ట్యాక్సులు మరియు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది అన్న కారణంతో ఈ కారును అమ్మాల్సిందిగా ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ ను సంప్రదించాడట. 48 లక్షల విలువ గల ఆ కార్ మెయింటైన్ చేయాలంటే టాక్సుల మోత మోగిపోద్ది. అందుకే దాన్ని అమ్మేద్దామని డిసైడ్ అయ్యాడట ఆ క్రీడాకారుడు. రష్యా ప్రధాని చేత ఇవ్వబడిన ఆ కార్ అమ్మడానికి వీళ్లేదని గొడవ చేయడంతో మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాడట. ఇంతకీ ఆ కార్ అమ్మేందుకు సిద్ధపడ్డ క్రీడాకారుడు ఎవరన్నది బయట పడలేదు.   



మరింత సమాచారం తెలుసుకోండి: