ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అవకాశం దక్కించుకున్న తెలుగుతేజం తిలక్ వర్మ ఎంత మంచి ప్రదర్శనకు చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ముంబై ఇండియన్స్ లో ఉన్న కీలక ఆటగాళ్లు అందరూ కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన నేపథ్యంలో తక్కువ అనుభవం ఉన్న యువ ఆటగాడు తిలక్ వర్మ మాత్రం ఎంతో పరిణితి చెందిన క్రికెటర్గా ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. యువకుడు కదా అనవసరమైన షాట్ లకు వెళ్ళి వికెట్ చేజార్చుకుంటాడేమో అనుకుంటే.. అద్భుతమైన షాట్ సెలక్షన్ తో సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.


 ఈ క్రమంలోనే ప్రతి సీనియర్ ఆటగాడు కూడా తిలక్ వర్మ బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు అని చెప్పాలి  అయితే ఒకానొక సమయంలో ఇక తిలక్ వర్మ మంచి ప్రతిభ ఉన్న ఆటగాడని అతను ఇండియా లోని మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకోవడం ఖాయం అంటూ రోహిత్ శర్మ కూడా చెప్పుకొచ్చాడు అనే విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు  ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన తర్వాత తాను ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను అన్న విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ శిబిరంలోకి వెళ్ళిన తర్వాతి  రోజే ప్రాక్టీస్ సెషన్ జరిగింది.


 ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నేను కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఆ సమయంలో ఇక రోహిత్ శర్మ  నా బ్యాటింగ్ శైలి నిశితంగా పరిశీలించారు. ఇక రెండవ రోజు కూడా అదే విధంగా నేను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా బ్యాటింగ్ తీరును పరిశీలించారు. వెంటనే నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు.. నీలో చాలా ప్రతిభ దాగి ఉంది. చిన్న వయసులోనే బాగా ఆడుతున్నావు. తప్పకుండా టీమిండియాకు సెలెక్ట్ అవుతావ్.. ఏకాగ్రత కోల్పోకుండా ఆడు. ఏ దశలోనే ఒత్తిడి పెంచుకోకు. ప్రతి సందర్భాన్ని కూడా ఆస్వాదించు. ప్రతిక్షణం ఆట పైనే దృష్టి సాధించు అంటూ రోహిత్ చెప్పడంతో ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంటూ తిలక్ వర్మ తెలిపాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: