ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉండగా ఈ పర్యటనలో భాగంగా నేడు టీమ్ ఇండియా నాలుగవ టి20 మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు జరిగిన మూడో టీ-20లో 2 మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా 2-1 తేడాతో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే టి20 సిరీస్ కూడా కైవసం చేసుకుంటుంది. అంతకు ముందు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా వన్డే సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది అనే విషయం తెలిసిందే. అయితే నాలుగవ టి20 మ్యాచ్ ఫ్లోరిడాలోని లాండర్ హిల్స్ సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం లో జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది అని చెప్పాలి. అయితే సమయం ఎక్కువగా దొరకడంతో ఇప్పటికే రెండు జట్లు కూడా హోరాహోరీగా నెట్ ప్రాక్టీస్ చేశాయి.


 అయితే ల్యాండర్ హిల్ పిచ్ టి20 ఫార్మాట్కు చాలా అనుకూలిస్తుంది. అమెరికాలో మాత్రం క్రికెట్ కు పెద్దగా ఆదరణ లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల సంఖ్య కూడా చాలా తక్కువే. ఇప్పటివరకు ఈ స్టేడియంలో 13 అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇక నేడు జరగబోయేది 14వ మ్యాచ్. అయితే ఈ పిచ్ పై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్లలో కె.ఎల్.రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2016 ఇదే పిచ్ పై  వెస్టిండీస్ పై ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 51 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు.


 అయినప్పటికీ అప్పట్లో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఒక్క పరుగు తేడాతో పరాజయాన్ని చవి చూడటం గమనార్హం. అయితే సరిగ్గా 2016లో ఇదే పిచ్ పై సెంచరీ చేసిన కె.ఎల్.రాహుల్ ఇప్పుడు మాత్రం జట్టులో లేకపోవడం గమనార్హం  గత కొంతకాలం క్రితం గాయం బారిన పడిన కేఎల్ రాహుల్ ఇక జట్టులోకి వచ్చే ముందు కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనకు పూర్తిగా దూరం అయిపోయాడు కేఎల్ రాహుల్. ఒకవేళ కె.ఎల్.రాహుల్ ఉండి ఉంటే మరోసారి సెంచరీ చేసేవాడు ఏమో అని అభిమానులు అనుకుంటూ ఒకప్పుడు సెంచరీని నెమరు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: