విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెబితే చాలు అతడు అంతర్జాతీయ క్రికెట్ లో సాధించిన అరుదైన రికార్డులు గుర్తుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతో అద్భుతమైన క్రికెటర్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ  తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం ఎంతో అలవోకగా ఛేదించి తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 నేటితరం క్రికెటర్లలో ఎవరికి కూడా సాధ్యం కాని రీతిలో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసింది ఒక విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పాలి. ఇక ఎవరూ కూడా విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేరు. అతని రికార్డులను బ్రేక్ చేయడం కూడా అంత సులభమేమీ కాదు అని చెప్పాలి. అయితే ఇలాంటి విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం నిరాశపరిచాడు. సరిగ్గా బ్యాటింగ్ చేయలేక విమర్శలు ఎదుర్కొన్నాడు.


  ఆసియా కప్ లో మాత్రం మళ్లీ ఫామ్ లోకి వచ్చి మూడేళ్ల తర్వాత సెంచరీ చేసి అదరగొట్టాడు. కాగా అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఖచ్చితమైన గేమ్ ప్లాన్ వుంటే తప్ప విరాట్ కోహ్లీనీ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. 15 ఏళ్లుగా క్రికెట్లో అతను సాధించిన విజయాలు అతని ఎప్పుడు గొప్ప క్రికెటర్గా నిలబెడతాయి అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యం గా టీ-20 ఫార్మెట్లో విరాట్ను ఎదుర్కోవడం అంత సులభం కాదు అంటూ తెలిపాడు. కాగా నేటి నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానుంది. కోహ్లీ ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరం గా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: