రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం.. ఐపీఎల్ లో ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది అని విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. జట్టులో మహా మహా ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎందుకో దురదృష్టం మాత్రం ఈ టీం ని వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆర్సిబి అభిమానులందరికీ కూడా ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక కలగానే మిగిలిపోయింది. అయితే ఒక్కసారైనా కోహ్లీ టీం టైటిల్ గెలవక పోతుందా అని అభిమానులు అందరూ కూడా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు.


 అయితే బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన చేసి చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించినప్పుడు కూడా.. గెలిచిన ఓడిన మేము ఆర్సీబీ వెంటే ఉంటాం అంటూ మద్దతుగా నిలుస్తూ ఉంటారు. అయితే కప్పు గెలవాలి అన్న కల మాత్రం ఎప్పుడు నెరవేరుతుందో అని ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఇటీవలే అభిమానులు కోరిక తీరింది. ఐపీఎల్ లో కప్పు గెలవలేకపోయినా.. అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం రెండో సీజన్లోని ఆర్సిబి టైటిల్ గెలుచుకుంది. దీంతో అటు ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.



 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇక ఆర్సిబి జట్టు ఘన విజయాన్ని అందుకొని టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఇక ఆర్సిబి అభిమానులు పెట్టిన పోస్టులతో సోషల్ మీడియా షేక్ అయింది. అయితే ఆర్సిబి గెలిచింది అంటే దానికి కారణం ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రి అని చెప్పాలి. ఆమె ప్రతిభతోనే ఆర్సిబికి కప్పు కల సహకారం అయింది. టోర్నిలో ఆమె మొత్తం 347 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉంది. ఇక అలాగే బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. ఈ టోర్నీలో ఏడు వికెట్లు పడగొట్టింది. ముంబై పై మ్యాచ్ లో 6 వికెట్లు తీసి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలను  నమోదు చేసింది ఎల్లిస్ పెర్రి. ఇక ఫైనల్ మ్యాచ్లో తన స్వభావానికి వ్యతిరేకంగా ఆడి మరీ జట్టును గెలిపించింది ఆమె. దీంతో ఆమె వల్లే మా కల నెరవేరింది అంటూ ఆర్సిబి ఫాన్స్ అందరు కూడా ఎల్లిస్ పెర్రికి థాంక్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl