ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లలో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద డిస్‌ప్లేతో ఉండే కొన్ని స్మార్ట్ వాచ్ లు కూడా అందుబాటు ధరలోకి వచ్చాయి. ఇందులో కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. వాటి ధర రూ.4000 కంటే తక్కువ.

ఫైర్ బోల్ట్
అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ .3,999. ఇది 1.7 అంగుళాల డిస్‌ప్లేతో SpO2 సెన్సార్‌ను కలిగి ఉంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలవడమే కాకుండా హార్ట్ రేట్ మానిటర్, ఫుల్ టచ్, మల్టిపుల్ వాచ్ ఫేస్‌ లాంటి ఫీచర్స్ వచ్చాయి. ఇది బూడిదతో సహా మొత్తం ఐదు రంగు వేరియంట్‌లలో వస్తుంది. అన్ని వేరియంట్‌ల ధర ఒకటే.

జియోనీ స్టైల్‌ ఫిట్ GSW 6
జియోనీ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్, అంతర్నిర్మిత మైక్ తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, హార్డ్ రేట్ మానిటర్ ఫీచర్స్  కూడా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ మోడ్‌, క్యాలరీ మీటర్‌ లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే యూజర్స్ whatsapp SMS, facebook మొదలైన యాప్స్ నుంచి నోటిఫికేషన్‌లను పొందవచ్చు. అమెజాన్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ వాచ్ సింగిల్ ఛార్జ్‌లో 3 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

క్రాస్ బీట్స్ ఆర్బిట్ బ్లూటూత్ కాలింగ్
క్రాస్ బీట్స్ ఆర్బిట్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీనితో పాటుగా బ్లూటూత్ కాలింగ్ కోసం యూజర్లకు మైక్,  స్పీకర్లను కూడా ఇచ్చారు. ఈ వాచ్‌లో 1.3 అంగుళాల HD IPS డిస్‌ప్లే ఉంది. ఇది మెటల్ కేస్ మధ్యలో ఉంటుంది. దీనిలో యూజర్స్ హార్ట్ బీట్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్, నిద్ర మానిటర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. పైగా ఇది వాటర్ ప్రూఫ్. ఈ వాచ్ IP68 వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది.

జీబ్రానిక్స్ స్మార్ట్ వాచ్
జీబ్రోనిక్స్ ZEB-FIT7220CH స్మార్ట్ వాచ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. అలాగే అమెజాన్‌లో దీని ధర రూ. 3099. ఇది 2.5 డి కర్వ్డ్ గ్లాస్ తో 1.75 అంగుళాల స్క్రీన్‌ను రక్షిస్తుంది. సమాచారం ప్రకారం ఈ వాచ్ కు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇది Sp O2 సెన్సార్, BP, హార్ట్ రేట్ మానిటర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: