బుల్లితెర మీద నవ్వులు పండించే షో ఏదన్నా ఉంది అంటే అది ఒక్క జబర్దస్త్ అనే చెప్పాలి. ఈ జబర్ధస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది  నటులు ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్త్ షో అనేది వీళ్ళకి లైఫ్ ఇచ్చిన షో అని చెప్పాలి. ఈ జబర్దస్త్ లో నటించిన చాలామంది సినిమాల్లో, ఈవెంట్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.  అలాంటి  నటులలో చమ్మక్ చంద్ర ఒకరు. జబర్ధస్త్‌లో చమ్మక్ చంద్ర స్కిట్స్ కోసం ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.ఎంతమంది కొత్తవాళ్లు వచ్చినా గాని జబర్దస్త్ షో లో చంద్ర స్థానం చంద్రా కే సొంతం. తనకి పోటీగా ఎంతమంది వచ్చిన బలాదూర్.తన స్కిట్స్ తో, తన పెరఫార్మెన్స్ తో  తన క్రేజ్  మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి, పెళ్ళాం బాధితుల  తరపున, అలాగే  ఫ్యామిలీ స్కిట్స్ చేయడంలో చమ్మక్ చంద్ర తర్వాతనే ఎవరైనా  అని నిరూపించుకున్నాడు.ఎన్నో ఏళ్ల పాటు జబర్దస్త్ లో కొనసాగిన చంద్ర జడ్జి నాగబాబుతో కలిసి  జబర్ధస్త్‌ను వీడి జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది అనే షో కి వెళ్ళిపోయాడు.

అయితే అక్కడ కూడా చంద్ర తన టాలెంట్ అంతా ఉపయోగించి అందరిని మెప్పించాడు.కానీ ఎన్ని షో వచ్చిన గాని జబర్దస్త్ ప్రోగ్రామ్ రేటింగ్ మాత్రం ఎప్పుడు టాప్ పోసిషన్లో నే ఉంది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య జీ తెలుగులో ప్రసారం అయ్యే  బొమ్మ అదిరింది షో  కార్యక్రమం ఆగిపోవడంతో అందులో నటించే నటుల పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది. నాగబాబును నమ్మి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని వదులుకుని అదిరింది షో కి వస్తే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కాస్త అటక ఎక్కింది. దీనితో చమ్మక్ చంద్ర పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. మళ్ళీ ఆయన తిరిగి జబర్దస్త్ లో నటిస్తారనే టాక్  అప్పట్లో హల్ చల్ చేసింది. అంతేకాదు ఒక విషయంలో నాగబాబుకి చమ్మక్ చంద్రకి ఏవో విభేదాల కారణంగా ఇద్దరికి  గ్యాప్ వచ్చిందని ప్రచారం కూడా సాగింది.

ఈ నేపథ్యంలోనే  చంద్ర మళ్లీ జబర్ధస్త్‌లోకి వస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఎన్ని వారాలు గడుస్తున్నా కానీ చమ్మక్ చంద్ర గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అసలు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడా లేక మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కి  రాకుండా ఎవరైనా బ్రేకులు వేస్తున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చంద్ర కనుక ఎటువంటి ప్రయత్నం చేయకుండా అలానే ఉంటే ఆయన కెరీర్‌ గాడితప్పే ప్రమాదం కూడా ఉంది.అయితే ఈ విషయంలో సీనియర్ కమెడియన్స్ అయిన  వేణు, ధనరాజ్ వంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మళ్ళీ ఏదోరకంగా చమ్మక్ చంద్ర తిరిగి మళ్ళీ బుల్లితెర  ఆడియెన్స్‌ను  ఎంటర్‌టైన్ చేయాలని ప్రేక్షకులు  కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: