ప్రముఖ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ లో ప్రముఖ లాయర్ కస్తూరి తులసి గా లీడ్ రోల్ చేస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇకపోతే ఈ సీరియల్ లో నెగిటివ్ రోల్ పోషిస్తున్న ఈమె అందం అభినయంతో నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన లాస్య రియల్ లైఫ్ గురించి కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

లాస్య అసలు పేరు వచ్చేసరికి ఈమెను ప్రశాంతి అని పిలుస్తారు. ఈమె నాన్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంప్లాయి గా పనిచేస్తూ ఉండటం గమనార్హం. ప్రశాంతి కి ఒక అక్క, ఒక తమ్ముడు, అలాగే ఒక చెల్లి కూడా ఉన్నారు. వీళ్ళ అమ్మ నాన్న కి నలుగురు సంతానమైతే ప్రశాంతి రెండవ సంతానం.. ప్రశాంతి చదువులో ఎప్పుడూ ముందు ఉండేదట.  గీతాంజలి యూనివర్సిటీ లో బీకాం పూర్తి చేసి అప్పట్లోనే ఇంటలిజెంట్ స్టూడెంట్ గా గుర్తింపు పొందింది. ఇకపోతే అప్పట్లోనే మంచి ఇంటలిజెంట్ తో చదువు లో దూసుకుపోతున్న ప్రశాంతి ని చూసి వాళ్ళ నాన్న కలెక్టర్ ను చేయాలని అనుకున్నాడట.

కానీ ప్రశాంతి కలెక్టర్ అవ్వాలనే కోరికను పక్కనపెట్టి తనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని బయటకు తీసింది. చదువు అందరూ చదువుతారు కానీ ఎంటర్టైన్మెంట్ అనేది కేవలం కొద్ది మంది మాత్రమే చేస్తారు.. నాకు అదే ఇష్టం అని వాళ్ళ నాన్న తో చెప్పిందట. ఇక తన చదువు పూర్తవగానే తన తండ్రిని అష్టకష్టాలు పడి ఒప్పించి చివరికి యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. శివరంజని అనే షో కి మొదటి సారిగా యాంకర్ గా పని చేసింది. మనోరంజని, శ్రీమతి భాగ్యశ్రీ , ఆంధ్రావాలా ఇలా మరికొన్ని షో లకు యాంకర్ గా పని చేసి ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో యాక్టర్ గా పనిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: