టాలీవుడ్ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా పేరు పొందారు యశ్. అయితే ఈ మధ్య కాలంలో తనకు సినిమా అవకాశాలు కాస్త పెరిగాయని చెప్పవచ్చు.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో ద్వారా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు యశ్. ఇక ఈ కొరియోగ్రాఫర్ అసలు పేరు యశ్వంత్.. కానీ తనకి పాపులారిటీ తెచ్చిన పేరు మాత్రం యశ్ .. అందుచేతనే తన పేరు అలాగే కొనసాగిస్తున్నాడు యశ్. ఇక ఈ కొరియోగ్రాఫర్ వేసే స్టెప్పులు అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి.


యశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేసినవి తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఓ బేబీ మరి కొన్ని సినిమాలలో కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే తాజాగా యశ్ తన హోమ్ టూర్ వీడియో ని షేర్ చేయడం జరిగింది . ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. కొత్తగా తన యూట్యూబ్ ఛానల్ ప్రవేశపెట్టాడు కొరియోగ్రాఫర్ యశ్. ఇక ఈ వీడియోలో తన ఇంటికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఆయన అభిమానులు ఎన్నో రోజుల నుంచి తనని హోమ్ టూర్ వీడియో చేయమని కోరుతూ ఉండడంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అని తెలిపాడు యశ్.


ఇక ఈ వీడియోలో యశ్ మాట్లాడుతూ తాను ఎక్కువ సమయాన్ని లివింగ్ రూమ్ లోనే గడుపుతానని , టీవీ లో ఎటువంటి సినిమా వచ్చినా కూడా చూస్తానని తెలియజేశారు. ఇక అంతే కాకుండా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారు. ఇక అంతే కాకుండా తన ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలను యశ్ అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఒక అభిమాని తనకి హ్యాండ్ మేడ్ పెయింటింగ్ ను కూడా పంపించగా.. వాటిని కూడా చూపించారు. తను క్రికెట్ ఆడి గెలుచుకున్న కొన్ని ట్రోఫీ , కప్పులను కూడా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: