బుల్లితెరపై మల్లెమాల బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంటుంది అందుకు సంబంధించిన ప్రోమోలను కూడా చాలా వెరైటీగా కట్ చేస్తూ ఏదో ఉన్నట్టుగా బ్రమ కలిగిస్తూ ఉంటుంది ప్రేక్షకులను. అందుచేతనే ఈ షోపైన.. అందరికీ ఆసక్తి కలిగించే టిఆర్పి రేటింగ్లను పెంచుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే ఎలాంటి ఈవెంట్ అయినా, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే ఒకే లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు తాజాగా వినాయక చవితి సందర్భంగా ఒక ఈవెంట్ ను నిర్వహించారు మల్లెమాల సంస్థ.. ఇక తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమోన్ కూడా విడుదల చేశారు. ఇందులో ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స పాల్గొన్నారు. ఇక దీనికి మన ఊరి దేవుడు అంటూ రాబోతున్న ఈవెంట్ల కృష్ణ భగవాన్ ,నాగినీడు ఖుష్బూ వంటి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఇక ఇందులో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ నుండి పలువురు కమెడియన్లతో చాలా సందడిగా చేశారని చెప్పవచ్చు ఇక ఇందులో ముఖ్యంగా వర్ష, ఇమ్మానుయేల్ ప్రేమల మీద పరీక్ష పెట్టడం జరిగింది. ఇక ఇమ్మానుయేల్ అయితే ఏకంగా తన చేతుల మీద నుంచి కారును పోనిచ్చుకున్నాడు.. ఇక వర్షాన్ని కూడా అలా చేయమని చెప్పడంతో నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు అంటూ వర్ష వెళ్ళిపోతుంది. అయినా కూడా ఆమె చేతుల మీద నుంచి కారును ఫోన్ ఇచ్చారు ఆ తర్వాత టాస్క్ లతో చాలా నవ్విస్తూ ఉంటారు. ఇక ఇందులో యాంకర్ ప్రదీప్ కూడా కనిపించారు. ఇక అంతే కాకుండా ఇందులోనే కమెడియన్ బురదలో కబడి ఆడుతున్నట్టుగా చిత్రీకరించారు. ఇక ప్రగతి ఆంటీ డాన్స్ ఈ ప్రోమో ఓకే హైలెట్గా నిలుస్తోందని చెప్పవచ్చు.. ఇక ఎప్పటిలాగే చివరిలో మల్లెమాల సంస్థ ఒక సస్పెన్షన్  ను చూపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: