శిరీష మొదటి యొక్క రజిత 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకొని తన భర్త ప్రోత్సాహంతోనే మొదటిసారి దూరదర్శన్ లో అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక శిరీష రెండవ అక్క సౌజన్య కూడా తన అక్క రజిత బాటలోనే వెళ్లి కొన్ని సీరియల్స్ చేసి తనకంటూ కూడా అందరు ఇలాగే మంచి పేరు దక్కించుకుంది. ఇక అందరికంటే చిన్నదైనా శిరీష మొదట్లో చిన్న చిన్న సీరియల్స్ చేసిన ఈమె మొగలిరేకులు సీరియల్ లో నటించిన పాత్రకు గాను శిరీష కు మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా లభించింది.మొగలిరేకులు సీరియల్ తర్వాత నటి శిరీష మళ్ళీ తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు స్వాతి చినుకులు, మనసు మమత , రాములమ్మ, కాంచన గంగ, నాతిచరామి వంటి సీరియల్స్ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఒక వ్యక్తిగా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది శిరీష. ఇకపోతే ఎక్కడో సిరిసిల్లలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన నటనతో అందరి చేత మెప్పు పొందుతోంది. ఏది ఏమైనా శిరీష కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారటంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి