ఇండియాలోనే హిందీ తో సహా అన్ని ప్రాంతాలలో కూడా బుల్లితెర రంగంలో తన హవా కొనసాగిస్తున్న షో బిగ్ బాస్. ఈ షో ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నది. వీటిని క్యాష్ చేసుకొని చాలామంది టెలివిజన్ దర్శక నిర్మాతలు కూడా పలు రకాల కాన్సెప్ట్ లతో ప్రతి సీజన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. హాలీవుడ్లో మొదలైన బిగ్ బాస్ షో ప్రస్తుతం ఇండియాలో కూడా తమ హవా కొనసాగిస్తోంది. బిగ్ బాస్ పైన ఎన్నో విమర్శలు, ట్రోల్స్, కేసులు వంటివి జరుగుతూ ఉన్న కొనసాగిస్తూ ఉన్నారు.


మొదట హిందీలో మొదలైన బిగ్ బాస్ షో ప్రస్తుతం అక్కడ 19వ సీజన్ మొదలు కాబోతోంది. తెలుగు, మలయాళం, కన్నడ ,తమిళ్ వంటి భాషలలో కూడా బాగానే ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఒక మూడు నెలల పాటు కేవలం 10 మంది వ్యక్తుల మధ్య గడిపేటువంటి కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో చూపించే  రొమాన్స్, అశ్లీలత కూడా తారస్థాయికి చేరిందని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కానీ అబ్బాయి అమ్మాయి ఒకే గదిలో ఒకే బెడ్ పైన పడుకోవడం సరైన సాంప్రదాయాలు కాదు అంటూ చాలామంది ఇప్పటికి విమర్శించారు.


బిగ్ బాస్ హొస్టులుగా చేస్తున్న సెలబ్రిటీల రెమ్యూనరేషన్ ఎంత అనే విషయానికి వస్తే.. హిందీలో ప్రసారం అవుతున్న సీజన్ కి సల్మాన్ ఖాన్ రూ .120 కోట్లకు పైగానే తీసుకుంటున్నారని సమాచారం. అలాగే అక్కినేని నాగార్జున కూడా రూ .30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. ఇక మలయాళ బిగ్ బాస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మోహన్ లాల్  రూ.7 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. కన్నడలో కూడా కిచ్చా సుదీప్ కుమార్ గా రూ .18 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: