ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. నిత్య‌వ‌స‌రాల‌కు స్మార్ట్‌ఫోన్ అవ‌స‌రంగా మారిపోయింది. ఇక రోజుకో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రావ‌డం.. బ‌డ్జెట్ ధ‌రలో ఉండ‌డం.. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మ‌రింత పెంచుతుంది. ఇక ఫోన్ కొనుగోలు చేసిన వారంద‌రూ ముందుగా ప్లే స్టోర్‌కు వెళ్లి త‌మ‌కు న‌చ్చిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. మెరుగైన ఫీచర్లను మీరు ఆసిస్తున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక ఉచిత అప్లికేషన్‌లు మీ ఆండ్రాయిడ్ డివైస్ కోసం రెడీగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.

 

గూగుల్ తన సొంత కెమెరా యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. ఫోటోస్పియర్ , 360 డిగ్రీ పానోరమా, వీడియో రికార్డింగ్ సమయంలోనే కావల్సిన ఫోటోలను క్యాప్చర్ చేసుకోవటం, లెన్స్ బ్లర్ ఫీచర్ వంటి ప్రత్యేకతలు ఈ యాప్ లో ఉంటాయి. అలాగు గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ యాప్ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చే బేసిక్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది.

 

అదేవిధంగా, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మరో యాప్ ట్రూడైలర్ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చిన డైలర్‌తో పోలిస్తే వేగవంతమైన సెర్చ్‌ను ఆఫర్ చేస్తుంటుంది. ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ క్యాలెండర్ యాప్ అత్యుత్తమంగా పనిచేస్తుంది.  గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ‘స్విఫ్ట్ కీ' అనే అప్లికేషన్ 70 థీమ్‌లతో కూడిన అడ్జస్టబుల్ సైజ్ కీబోర్డ్‌లను మీకు అందుబాటులో ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: