వినాయక చవితి వచ్చిందంటే చాలు వాడ వాడ వినాయక ప్రతిమలను ప్రతిష్టించడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అందరూ కలిసి ఒకచోట ఎంజాయ్ చేయడం కంటే ఎవరికి వారు వారి కాలనీలలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేయడానికి ఇష్టపడతారు. దాదాపు పదకొండు రోజులపాటు వినాయకుడి దగ్గర ఆడిపాడి బాగా సందడి చేస్తూ ఉంటారు. అయితే ఇక ప్రతి వినాయక మండపం దగ్గర కూడా డిజె సౌండ్.. అదిరిపోయే డాన్సులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి రోజు కూడా యువత ఇలా వినాయక మండపం దగ్గర ఎంజాయ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు.


 ఇక్కడ కొంతమంది యువకులు ఇలాంటిదే చేశారు. ఏకంగా పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  కానీ అంతలో ఊహించని ఘటన అందరిని విషాదంలో ముంచెత్తింది. అందరూ ఆనందంగా వినాయకుడి దగ్గర సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సమయంలో  ఏకంగా విధి వారిని చిన్నచూపు చూసింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తూ అందరినీ అలరించిన ఓ యువకుడు చూస్తూ చూస్తూ ఉండగానే ఒక్క క్షణంలో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్తా అటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఈ వీడియో చూసి అటు నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు అనే చెప్పాలి. ఇలా వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా మృతి చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. గౌతమి పుర కాలనీ లో వినాయక చవితి సందర్భంగా కాలనీవాసులు సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుల్లయ్య అనే యువకుడు మండపం వద్ద డాన్స్ చేశాడు ఇక తనదైన శైలిలో డాన్స్ చేస్తూ అందరిని అలరించాడు. కానీ అంతలో డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: