గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడం మామలు విషయం కాదు.. అందులో చోటు దక్కాలంటే చాలానే కష్టపడాలి.  రిస్క్ చేయాలి .. వీటితో పాటు మనకి అదృష్టం కూడా కలిసి రావాలి .. అయితే ఎవరు చేయలేని అద్భుతాన్ని సాధించిన వారే  ఈ గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుంటారు .. మరి కొందరు అప్పుడే ఉన్న రికార్డును అధిగమించి గొప్ప రికార్డును సాధించి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదిస్తూ ఉంటారు .. అయితే అలాంటిదే  తాజాగా ఒక  ఫుట్ బాల్ మ్యాచ్ లో 
రికార్డు నమోదు అయ్యింది ..  మరి అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

ఫుల్ బాల్ చరిత్రలోనే లాంగెస్ట్ గోల్ నమోదైంది. టామ్ కింగ్ ఈ గోల్ ను కొట్టాడు. న్యూపోర్ట్ కౌంటీ చెల్టెన్‌హామ్ ‌తో జ‌రిగిన మ్యాచ్‌లో న్యూపోర్ట్ కౌంటీకి చెందిన గోల్‌కీప‌ర్ టామ్ కింగ్‌ ప్ర‌త్య‌ర్థి గోల్‌పోస్ట్‌లోకి బాల్‌ ని  96.01 మీట‌ర్లు  కిక్ చేసి రికార్డు నెలకొల్పడం విశేషం.. అయితే అంతకుముందు 2013  లో అస్మిర్ బెగోవిక్ కొట్టిన 91.9 మీట‌ర్ల  గోల్ రికార్డును  తాజాగా టామ్ కింగ్ ఆధిగమించాడు .. టామ్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడని గిన్నిస్ బుక్ రికార్డ్స్  వెబ్ సైట్  ధృవీక‌రించింది  “చరిత్రాత్మక కిక్ తో అధికారికంగా లాంగెస్ట్ గోల్ రికార్డును కింగ్ బద్దలుకొట్టాడు. ఇది ఏకంగా 96.01 మీటర్లు ప్రయాణించి గోల్ గా నమోదైంది” అని వెల్లడించింది...

ఈ సందర్బంగా టామ్ కింగ్ మాట్లాడుతూ  “నేను నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నా.  అలాగే  గర్వంగా కూడా  ఫీలవుతున్నా.ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు.” అని తెలిపాడు . కాగా అతడికి ఇది తొలి గోల్ కావడం విశేషం. కొట్టిన తొలి గోల్ గిన్నిస్ బుక్  అఫ్ రికార్డు లోకి ఎక్కడం పై టామ్ ఆనందానికి అవధులు లేవు .. ఇంత రికార్డు సాధించిన కూడా అతడు సంబరాలు చేసుకోలేదు .. తన ప్రత్యర్థి జట్టు చెల్తెన్ హామ్  పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: