ఈ రోజులలో ప్రతి ఒక్కరూ చిన్న,పెద్ద  అని తేడా లేకుండా ఏదో విధంగా డబ్బు  సంపాదించాలి అనుకుంటారు . అందుకు కారణం  మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఉండాలి అనే తపన ..అయితే పెద్ద పెద్ద చదువులు చదివి, కొంతమంది జాబ్ చేసి సంపాదిస్తారు. మరి కొంతమందేమో సొంతంగా  బిజినెస్ చేసి సంపాదిస్తారు.  కానీ ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి గురించి చెప్తే షాకవ్వాల్సిందే.. కేవలం పదో తరగతి మాత్రమే చదివింది. కానీ నెల సంపాదన అక్షరాల రూ.2 లక్షలట. ఇంతకూ ఆమె ఎవరు..?ఆమె ఎలా సంపాదిస్తోంది..? అనే విషయాన్ని  ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో వచ్చిన గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం నందిని వయసు 33 సంవత్సరాలు. ఆమె తండ్రి  దేవాలయాల్లో పూజారిగా  పనిచేసేవారు. అయితే చిన్నప్పట్నుంచి నందినికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది.  కానీ ఆమె కుటుంబం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో, ఆమె కేవలం 10 తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. అయితే  మధ్య చిన్న తరహా కుటుంబాలలో కొంతమంది  తమ ఆడ పిల్లలకు  18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేస్తారు . ఈ కార్యక్రమంలో నే నందినికి కూడా  పెళ్లి చేశారు.


నందిని భర్త పేరు శ్రీకాంత్ శాస్త్రి. ఇతను కూడా దేవాలయాల్లో పూజారిగా పని చేసేవారు. ఇక నందిని కూడా చిన్నా చితకా పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండేది. కానీ అది వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోయేది కాదు. ఇదిలా ఉండగా అనుకోకుండా ఒక రోజు నందిని తండ్రి గారు చనిపోయారు. ఇక దీంతో తన చెల్లెలు పెళ్లి భారం కూడా తనపై పడింది.. ఇంకా కష్టాలు మొదలయ్యాయి నందినికి. కానీ తన భర్త తరపు బంధువులు ఎవరో ఉబర్  లో క్యాబ్ నడిపిస్తే,దాని వల్ల లాభం ఉంటుంది అనేసరికి, నందిని తన భర్త కలిసి, తమ వద్ద ఉన్న నగలను తాకట్టు పెట్టి టయోటా  కారు కొని,ఉబర్ లో తిప్పడం మొదలుపెట్టారు..


అలా మరి కొద్ది రోజులకు  ఉబర్ లో డబ్బు సంపాదించేందుకు ఇంకో మార్గం కూడా వారికి దొరికింది. ఉబర్ సంస్థకు క్యాబ్ డ్రైవర్లును జాయిన్ చేపిస్తే, రెఫరల్ అమౌంట్ ను కూడా ఇస్తారట. అది రూ.3 వేల వరకు ఉంటుంది. దీనితో నందిని, ఆమె భర్త కూడా ఆ పని స్టార్ట్ చేశారు. అందుకోసం ఏకంగా ఒక చిన్న పాటి ఆఫీస్ ను కూడా తయారు చేశారు. అలా ఆ ఆఫీసు ద్వారా  నందిని, ఆమె భర్త కలిసి సుమారు 600 మంది డ్రైవర్లను ఉబర్ లో చేర్పించారు. దీనితో ఆమె ఆదాయం ఒక్కసారిగా అమాంతం పెరిగింది. ఇప్పుడు ఆమెకు నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తోందట. ఒకవైపు క్యాబ్లు  తిప్పడం, మరోవైపు రిఫరెన్సు చేర్పించడం, ఇది ఆమె చేస్తున్న పని. ఏది ఏమైనా ఆమె పడ్డ శ్రమకు తగిన ఫలితం లభించింది కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి: