మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు పెద్దలు  అంతేకాదు విధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే అని చెబుతూ ఉంటారు  కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. సంతోషం గా సాగిపోతుంది అనుకుంటున్న జీవితంలో అనుకోని ఘటనలే ఊహించని విషాదాన్ని నింపుతు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆనందంగా గడపాలి అనుకున్న జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేందుకు ఎన్నో ఊహించని ఘటనలు దూసుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  దీంతో అనుకోని ఘటనలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు విషాదంలో మునిగి పోతుంటాయ్. ఇక్కడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఇక్కడ ఓ యువతి పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంది. తనకు నచ్చిన వ్యక్తి తన జీవితంలోకి వచ్చి ఎంతో ఆనందంగా చూసుకుంటాడు అని ఆశ పడింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెద్దలు అందరి సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.  దీంతో కొత్త జీవితాన్ని ప్రారంభించ పోతున్నాను అంటూ ఆ యువతి ఎన్నో కలలు కన్నది. కానీ ఆ యువతి కన్న కలలు అన్ని కనుమరుగయ్యాయి. పెళ్లయిన కొన్నాళ్లకే యువతి ప్రాణాలు వదిలింది.



 ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. భారీగా వర్షాల కారణంగా వచ్చిన వరదలతో చివరికి నవ వధువు ప్రాణాలు విడిచింది. కర్ణాటక రాయచూరు ప్రాంతానికి చెందిన సంధ్య.. హరీష్ అనే యువకుడిని గత నెల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే భర్తతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావించింది. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తుఫాన్ వాహనంలో బయలుదేరారు. అయితే తిరుపతిలో భారీగా వర్షాలు పడుతుండడంతో ఇక వరద నీరు వెస్ట్ చర్చి రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిండిపోయాయి. ఈ క్రమంలోనే ఇక అక్కడ కారు వరదల్లో చిక్కుకుపోయింది. మిగతా వాళ్ళందరూ  కార్ నుండి తప్పించుకున్నారు. కానీ చివరికి మాత్రం నవ వధువు మాత్రం తప్పించుకోలేక ప్రాణాలు వదిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: