గత నాలుగైదు రోజుల నుంచి సంచలనంగా మారింది మేఘాలయలో హనీమూన్ జంట హత్య కేసు.. ఈ కేసు ఇప్పుడు మరువక ముందే ఇప్పుడు తాజాగా ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురాలో మరొక సంఘటన ఇలాంటిదే బయటపడింది. అగర్తలోని ఇంద్రనగర్ కు చెందిన ఒక యువకుడు అదృశ్యం వెనుక పోలీసులు రహస్యాలను సైతం చేదించి బట్టబయలు చేశారు.


త్రిపుర రాజధాని అగర్తలకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే ధలై జిల్లాలో ఉండేటువంటి మార్కెట్ యార్డు లో ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో దాచిన ట్రాలీ బ్యాగులో ఒక యువకుడు మృతి దేహం బయటపడింది. మేఘాలయాలలో జరిగిన హనీమూన్ హత్య లాగే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. మరణించిన యువకుడు స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టులో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నారట.. అతడి పేరు సరిపుల్ ఇస్లాం.. మరణించిన యువకుడి వయసు 20 సంవత్సరాలు.. దిబాకర్ అనే వైద్యుడుతో మరో మహిళా మధ్య జరిగిన ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో యువకుడు హత్య అయినట్లుగా పోలీసులు తెలియజేశారు.


ప్రాథమిక దర్యాప్తులో మొదట ఆ మహిళకు, ఈమె యొక్క బంధువు అయినా దిబాకర్  మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని అధికారులు తెలిపారు.. సరేఫుల్ ఇస్లాం తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉండేదని.. దీంతో  పక్కా ప్లాన్ తో డాక్టర్ అతని తల్లితండ్రులతో సహా మరో ఆరుగురు ప్లాన్తో మర్డర్ చేశారు. వీరితోపాటు మరొక మహిళ కూడా ఉన్నది. జూన్ 8వ తేదీన సాయంత్రం దిబాకర్, సరిపుల్ ఇస్లాంను దగ్గరలో ఉండే ప్రాంతానికి పిలిపించి ఇంటిలో బహుమతి ఇస్తామని చెప్పి మరి అతని మాటలు మేరకు అక్కడికి వెళ్లిన సరిపుల్ అక్కడికి వెళ్లిన వెంటనే దిబాకర్ తో పాటు అతని స్నేహితులు అందరూ కలుసుకొని దాడి చేసి గొంతు నరికి మరి హత్య చేశారట. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్ లో ప్యాక్ చేసి మరి పడి వేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: