సుజుకి టూ వీలర్ రంగంలో మిగతా మోటార్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త అధునీకరణలతో బైకులు రిలీజ్ చేస్తుంది. ఇక 2019 కొత్తగా మరో మోడల్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది సుజుకి. సుజుకి నుండి కొత్తగా హయబుస బైక్ వస్తుంది. రెండు డిఫరెంట్ కలర్స్ తో మాత్రమే ఈ బైక్ రిలీజ్ అవుతుంది.


1340 సిసి ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ 199.7 బి.హెచ్.పి, 155 ఎన్.ఎం టార్క్ తో నాలుగు ఇంజిన్స్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ వెహికల్ ధర 13.59 లక్షలు కాగా 1 లక్ష అడ్వాన్స్ పేమెంట్ తో ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. 20 ఏళ్ల లాంగ్ రన్ తర్వాత సుజుకి హయాబుస మళ్లీ వస్తుంది.


జపాన్, యూరప్ లలో ఈ బైక్ ఆపేయడం జరిగింది. కవాసకి నింజా జెడ్.ఎక్స్-14ఆర్ బైక్ కు ఈ బైక్ గట్టి పోటీ ఇస్తుంది. కవాసకి బైక్ ప్రైజ్ 19.70 లక్షలు దాకా ఉంది. అంటే ఎలా లేదన్నా సుజుకి 6 లక్షలు తక్కువ ధరకే అంత ఫీచర్స్ ఉన్న బైక్ రిలీజ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం లక్సరీ బైక్ కావాలనుకునే వారు సుజుకి హయాబుసను ప్రిఫర్ చేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: