జమ్మూకశ్మీర్‌లో భారత జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ జవాను వీర మరణం పొందిన సంగతి విధితమే. ఇతను నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం కోమనపల్లి గ్రామానికి చెందిన వాడు. జవాను రాడ్యా మహేష్‌ మరణ వార్తను కుటుంబానికి ఆర్మీ అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యుల రోదన చెప్ప శక్యం కానిది.ఈ క్రమంలో కోమన్ పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడ మహేష్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయులు నివాళి అర్పించారు.

మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన మహేష్ ను తిరిగి ఇవ్వలేకపోయినా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని అని తెలిపారు. సీఎం కేసీఆర్ సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని భరోసా ఇచ్చారు.మంగళవారం సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకోనుంది. ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.జమ్మూ కశ్మీర్‌లోని మచిల్ సెక్టర్‌లో ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళ సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.

మన భద్రత కోసం దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాన్ని అడ్డుపెట్టి వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళి.. భారత జవాన్ అంటే నిలువెత్తు ధైర్యం.. దేశానికి ఆయుధం సైనికుడు.. దేశ ప్రజల క్షేమం కోసం వారు సుఖంగా నిద్ర పోవడం కోసం.. వారు మేల్కొని రక్షణ కల్పిస్తూ కష్టమైన ఎంతో ఇష్టంగా తమ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ శత్రువును చీల్చి చెండాడే మహోగ్ర రూపం సైనికుడు.. అటువంటి సైనికులకు మా అశ్రునివాళి.. సైనికుడిగా బతకడం దేశ యువత కు మార్గం.. రండి జవాను గా మారాలని లక్ష్యం పెట్టుకోండి.. దేశానికి సేవ చేయండి.. జై హింద్..


మరింత సమాచారం తెలుసుకోండి: