గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలక మండలిలో విభేదాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆ విభేదాలు ఇప్పుడు మీడియాకు ఎక్కడం గమనార్హం. నూతనంగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులపై సెక్రటరీ మురళి ముకుంద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొసైటీ బైలా ప్రకారం సెక్రటరీ స్థానంలో ఉన్న తాను రికార్డ్స్ మెయింటెన్ చేస్తున్నానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సెక్రటరీ ఇతర సభ్యులు రికార్డు చూడాల్సి ఉంటుందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా రికార్డు తాళాలు ఇవ్వాలని ప్రెసిడెంట్, ఇతర సభ్యులు తనను రెండు గంటలపాటు నిర్బంధించారని మురళి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన పై దౌర్జన్యం చేశారని తెలుపుతూ సెక్రటరీ మురళి పోలీసులతో పాటు సహకార సంఘాల రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. మొన్నటి దాకా వార్తల్లోనే నిలుస్తూ వచ్చిన సొసైటీ ఇప్పుడు ఇలా వార్తల్లోకి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: