సీఎం కేసీఆర్ పాలనలో బాలికల విద్యకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. ఉన్నత విద్యలో బాలికల ప్రవేశాల నిష్పత్తి జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తోందంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. ఇందుకు తార్కాణంగా ఆమె కొన్ని గణాంకాలను ప్రస్తావించారు. తెలంగాణలో  పీజీలో 72 శాతం, డిగ్రీలో 52శాతం, గురుకులాలు, కేజీబీవీల్లో 69శాతం , బీఈడీ మొదటి శాతంలో 81శాతం బాలికల ప్రవేశాలున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  తెలిపారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైద్య కళాశాలల కేటాయింపులో తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. కొత్త విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వ కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: