ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...జుట్టు సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి.ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు సమస్యలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి.ఎక్కువ చలి, ఎక్కువ ఎండ ఉండే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. శీతాకాలంలో హ్యుమిడిటీ లెవెల్స్ హఠాత్తుగా పడిపోవడం వల్ల స్కాల్ప్ డ్రై గా, ఫ్లేకీ గా అయిపోయి చుండ్రుకీ, హెయిర్ డ్యామేజ్ కీ దారి తీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంట హెయిర్ కండిషనింగ్ తప్పని సరిగా చేయాలి.అందుకే, సెలూన్ కి వెళ్ళి బోలెడంత ఖర్చు పెట్టి హెయిర్ నరిషింగ్ ట్రీట్మెంట్స్ తీసుకునే బదులు ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతి పాటించండి.. ఇక అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలుసు... అవి జుట్టుకి చాలా హెల్ప్ చేస్తాయి. వాటిలో ఫైబర్ గుణాలు జుట్టు రాలి పోకుండా కుదుల్లని బలంగా ఉంచుతాయి. అందుకే జుట్టు బాగా బలంగా ఉండటానికి అవిసె గింజలతో నూనెని తయారు చేసుకోండి.. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూడండి...


అవిసె నూనె తయారీకి కావాల్సిన పదార్ధాలు...అవిసె గింజలు - నాలుగు కప్పులు,
నీరు - ఒక కప్పు,
ఏదైనా ఎస్సెన్షియల్ ఆయిల్,
ఒక బౌల్...

అవిసె నూనె తయారు చేయు విధానం...
ముందు రోజు రాత్రి ఒక బౌల్ లో అవిసె గింజలు వేసి, నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. పొద్దున దీనిని సాస్ పాన్ లో వేసి మిశ్రమం చిక్కబడే వరకూ వేడి చేయండి.ఆ తరువాత ఇంకొక బౌల్ లోకి వడకట్టండి. మంచి పరిమళం కోసం మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్ ని కొన్ని చుక్కలు కలపండి.ఈ జెల్ ని ఫ్రిజ్ లో, లేదా ఏదైనా చల్లని ప్రదేశం లో స్టోర్ చేసుకోండి. హెయిర్ వాష్ తరువాత దీనిని కండిషనర్ లాగా అప్లై చేయండి. కొంత సేపు అలా వదిలేసి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగేయండి.మీది ఫ్రిజ్జీ హెయిర్ అయితే దీని వల్ల జుట్టుకి మంచి బలం, టెక్స్చర్ వస్తాయి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: