మహిళలు తమ స్కిన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

ఎండాకాలం కావడంతో ఎండలు ఎలా దంచి కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బయటకు వెళితే ఎండ తీవ్రత కారణంగా చర్మం ఖచ్చితంగా ట్యానింగ్‌కు గురవుతోంది.ఇంకా మరోవైపు డీ హైడ్రేట్ అయి నిర్జీవంగా కూడా మారుతుంటుంది. ఈ క్రమంలో వేసవిలో చర్మ సంరక్షణకు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే చాలామంది పగలు చర్మంపై శ్రద్ధ తీసుకున్నా, రాత్రి వేళ మాత్రం వదిలేస్తుంటారు. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. అందుకే రాత్రి సమయంలో చర్మాన్ని కాపాడేందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..చాలామంది మహిళలు రాత్రి నిద్రించేముందు పగలు వేసుకున్న మేకప్ ని తొలగించడం మర్చిపోతుంటారు లేదా దానిపట్ల నిర్లక్షం వహిస్తుంటారు. ఈ అలవాటు చర్మానికి అసలు ఏ మాత్రం మంచిది కాదు. బయట్నించి వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మేకప్ తొలగించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. 


ఇంకొంతమంది అయితే చలి పెరిగినప్పుడు అదే పనిగా నూనెని రాస్తుంటారు. దీ నివల్ల వారి చర్మం ఆయిలీగా అయిపోతుంది. అందుకే రాత్రి పడుకునేముందు లైట్ మాయిశ్చరైజర్ వాడితే చాలా మంచిది. రాత్రి పూట చర్మం పట్ల కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఈ చర్మ సంరక్షణపై ఎంత శ్రద్ధ తీసుకంటే అంత మంచిది. ఇంకొందరైతే రాత్రి పూట మాయిశ్చరైజర్ రాస్తారు కానీ పగలు మాత్రం రాయరు.వారు కేవలం ఒకసారి రాస్తే సరిపోతుందనుకుంటారు. అయితే ఇది సరైన విధానం కాదు. ఉదయం పూట కూడా మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల చర్మానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి.ఇంకా అదే సమయంలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఖచ్చితంగా ప్రయత్నించాలి. అలాగే మాయిశ్చరైజర్ కూడా అదేపనిగా ఎక్కువ వాడకూడదు.ఎందుకంటే మాయిశ్చరైజర్ రాస్తుంటే పింపుల్స్ సమస్య వెంటాడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. చర్మాన్ని అందంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: