రీ ఎంట్రీ లో అదరగొడుతున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచేలా చేసింది అని చెప్పొచ్చు.. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళయాళ హిట్ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు.