వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయగా పవన్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో ఈ సినిమా చేయడం విశేషం..